17/12/2024 Today news information
విశాఖ:-
విశాఖ
కలెక్టరేట్ లొ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ కు విశాఖ
కేంద్రంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో జరిగిన భూకబ్జాలు, భూదందాలు,పోర్జరీలపై ఫిర్యాదు చేసిన జనసేన కార్పొరేటర్
పీతల మూర్తి యాదవ్
గత
సిట్ నివేదికలను బహిర్గతం చేసి చర్యలు తీసుకోవడంతో పాటు వైసీపీ ప్రభుత్వంలొ జరిగిన
భూలావాదేవీల పై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో సిట్ వేసి వాటిపై విచారణ జరిపించాలని
వినతి...
రాష్ట్రంలో
అతి పెద్ద నగరమైన విశాఖ కేంద్రంగా రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్ల కాలంలో వేల కోట్ల రూపాయల భూకబ్జాలు,
అక్రమాలు,ఫోర్జరీ పత్రాలతో భూస్వాధీనాలు,భూకుంభకోణాలు జరిగాయి...
2014-19 మధ్య
తెలుగుదేశం ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో విశాఖ
భూకుంభకోణాలపై ఒక సిట్ వేసి విచారణ జరిపారు...ఆ విచారణ కమిటీ 1000 పేజీలకు పైగా నివేదికను
ప్రభుత్వానికి సమర్పించింది...
ఆ
నివేదికను బయట పెట్టలేదు...నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోలేదు...
2019లో
అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్
కుమార్ నేతృత్వంలో మరో సిట్ ను ఏర్పాటు చేసి భూకంభకోణాలపై విచారణ జరిపింది...
0 Comments